Advertisementt

ఈసారి మణిరత్నం తీసే సినిమా అది కాదట.!

Mon 31st Aug 2015 05:09 AM
director mani ratnam,maniratnam new movie,karthi in mani ratnam movie,dulkar salman in maniratnam movie,maniratnam movie in pre production  ఈసారి మణిరత్నం తీసే సినిమా అది కాదట.!
ఈసారి మణిరత్నం తీసే సినిమా అది కాదట.!
Advertisement
Ads by CJ

మణిరత్నం సినిమాలంటే ఓ స్పెషాలిటీ వుంటుందని, సినిమాకి ఎలాంటి టాక్‌ వచ్చినా ఒకసారి అతని సినిమా చూడాల్సిందే అనుకునే ప్రేక్షకులు చాలా మంది వుంటారన్నది తెలిసిన విషయమే. ఒకవిధంగా చెప్పాలంటే వాళ్ళంతా మణిరత్నం ఫ్యాన్స్‌ అనుకోవచ్చు. ఆయన డైరెక్షన్‌లో సినిమా స్టార్ట్‌ అయిందంటే ఓ కొత్త తరహా సినిమాని మనం చూడబోతున్నామని ఆడియన్స్‌ గట్టిగా నమ్ముతారు. ఈసారి కార్తీ, దుల్కర్‌ సల్మాన్‌ హీరోలుగా మణిరత్నం చెయ్యబోతున్నాడు. ఇద్దరు హీరోల మధ్య జరిగే రివెంజ్‌ డ్రామాతో సినిమా చేస్తున్నాడన్న వార్త రాగానే సినిమాపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఘర్షణలాంటి సినిమా అనీ, ఘర్షణ చిత్రాన్ని మరో యాంగిల్‌లో చూపించబోతున్నాడని రకరకాలుగా ఊహిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఘర్షణ తరహా సినిమా కాదని, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఒక కొత్త కాన్సెప్ట్‌తో మణిరత్నం ఈ సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. 
సాధారణంగా మణిరత్నం ఏ కథ రాసుకున్నా అందులో మహాభారతంలోని క్యారెక్టర్సే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఈ సినిమా మాత్రం మానవ సంబంధాల నేపథ్యంలో తయారు సబ్జెక్ట్‌ అని ప్రీ ప్రొడక్షన్‌ వల్ల బయటకి వచ్చిన సమాచారం. ఈమధ్య మణిరత్నం చేసిన 'ఓకే బంగారం' చిత్రాన్ని కూడా ప్రజెంట్‌ యూత్‌ ఆలోచనలపై చేసిందే. అలాగే ఈ చిత్రాన్ని కూడా రూపొందించబోతున్నాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ