మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా రామ్‌చరణ్‌కు టాలీవుడ్‌లో స్టార్‌ఇమేజ్ ఉంది. కానీ ఇక్కడ పూర్తిగా మార్కెట్‌ను ఆక్రమించుకోకుండానే తొందపడి ఆయన బాలీవుడ్‌కు వెళ్లి 'జంజీర్' రీమేక్‌లో నటించాడు. ఈ చిత్రం అన్నిచోట్లా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రామ్‌చరణ్ తెలుగులో సుస్థిరస్థానం సంపాదించే వరకు మరలా బాలీవుడ్‌కు వెళ్లడని అందరూ అనుకున్నారు. కానీ రామ్‌చరణ్‌కు మాత్రం ఇప్పటికీ బాలీవుడ్‌పై మోజు పోలేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవిర్క్‌ర్ ప్రస్తుతం హృతిక్‌రోషన్‌తో 'మొహంజదారో' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన రామ్‌చరణ్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీస్తానని చెర్రీకి మాట ఇచ్చాడట. దీంతో 'జంజీర్' ఫ్లాప్ నుండి రామ్‌చరణ్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని... కాబట్టి రామ్‌చరణ్ స్పీడ్‌కు చిరు అయినా అడ్డుకట్ట వేస్తాడో లేదో చూడాలని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.