50రోజులు, 100రోజులు, 175రోజుల కాలం పోయింది. ఇప్పుడు సినిమాలు వేలసంఖ్యలో థియేటర్లల్లో రిలీజ్ అవుతున్నాయి. మూడునాలుగు వారాలకు మించి ఆడటం లేదు. ' బాహుబలి' సినిమాకు సంబంధించిన కొన్ని మెయిన్ స్క్రీన్లలో ఇంకా షేర్లు వస్తున్నాయి. చాలావరకు 'బాహబలి' ప్రదర్శన ముగిసింది. కానీ కొందరు అభిమానులు ఈ చిత్రం ప్రదర్శన ఇంకా పెంచాలని కోరడం విచారకరం. కొన్నిసార్లు అభిమానులు వాళ్ల జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరుతున్నారు. మరి కొన్నిసార్లు ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి ఫాల్స్ రికార్డుల వల్ల మనం ఏం సాధించుకుంటాం ఫ్రెండ్స్. అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. ప్రేక్షకులు మనకు మరిచిపోలేని విక్టరీ ఇచ్చారు. అది మన జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. అంతకు మించి మనకు కావాల్సింది ఏముంది? మన సినీ పరిశ్రమలో ఈ రకమైన రికార్డుల గురించి సమస్య చాలాకాలంగా ఉంది. అందులో మనమూ భాగం కావోద్దు. అలాంటి పరిస్థితులు ఆపాల్సిన అవసరం ఉంది. షేర్స్ వస్తున్న థియేటర్లలో 'బాహుబలి' ప్రదర్శించబడుతుంది.షేర్స్ రాని థియేటర్లలో 'బాహుబలి' స్థానంలో ఇతరకొత్త సినిమాలు ప్రదర్శితం అవుతాయి. రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేయడం వంటివి వద్దు.. అని రాజమౌళి హితవు పలికాడు. ఆయన చెప్పిన మాటలను అందరు హీరోలు, వారి అభిమానులు పాటించాల్సిన అవసరం ఉంది.