పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్ రెండో షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రంలో 'జిల్' విలన్ కబీర్‌సింగ్ నటిస్తున్నాడు. పవన్ బర్త్‌డే స్పెషల్‌గా ఈచిత్రం తొలి టీజర్ సెప్టెంబర్ 1వ తేదీ అర్థరాత్రి 12గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ హీరో వరుణ్‌తేజ్, ప్రజ్ఞాజైస్వాల్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కంచె'. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. ఇటీవల విడుదలైన 'కంచె' ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రెండో ప్రపంచ యుద్ద నాటి సన్నివేశాలు టీజర్లో చూసి అంతా అద్భుతం అని మెచ్చుకుంటున్నారు. తాజాగా పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2 వతేదీన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ పుట్టినరోజుకు వెల్‌కం చెబుతూ 1వ తేదీ అర్థరాత్రి ఈ చిత్రం ట్రైలర్ విడుదలకానుంది. కాగా ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నారు. సినిమాను గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.