రకుల్‌ప్రీత్‌సింగ్ బిజీగా ఉండటంతో మహేష్ నటించబోయే 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారు. కానీ మరలా రకుల్ ఎంటర్ కావడంతో సమంత బయటకు వచ్చేసింది. అయితే రకుల్ ఎంటర్ కాకముందే సమంత ఈ చిత్రం నుండి బయటకు రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు నితిన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో స్టార్ట్ అయ్యే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. దీంతో మహేష్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లలో ఒకతిగా చేసేబదులు.. తనకు అత్యంత ఇష్టమైన త్రివిక్రమ్ సినిమాకే సమంత ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈ విషయంలో మహేష్ కన్నా త్రివిక్రమ్‌నే సమంత ఎక్కువగా నమ్ముకొంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే...!