రకుల్‌ప్రీత్‌సింగ్‌ను టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా చెప్పవచ్చు. ఆమె నటించిన 'కిక్2' చిత్రం ఇటీవలే విడుదలైంది. కాగా ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్-శ్రీనువైట్లల చిత్రంతో పాటు, ఎన్టీఆర్-సుకుమార్‌ల 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమె బిజీ షెడ్యూల్ వల్ల మహేష్‌బాబు నటించే 'బ్రహ్మూెత్సవం' చిత్రం నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ అనుకోకుండా 'బ్రహ్మూెత్సవం' చిత్రం ప్రారంభం ఆలస్యం కావడం ఆమెకు కలిసొచ్చింది. ఆల్‌రెడీ ఆమె 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఆమె పార్ట్ షూటింగ్ వేగంగా పూర్తికావడంతో మరలా ఆమెకు 'బ్రహ్మూెత్సం' టీం నుండి పిలుపొచ్చింది. ఈసారి మాత్రం ఆమె మహేష్‌బాబును మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయి డేట్స్ ఇచ్చేసిందని సమాచారం. దీంతో ఆమె స్థానంలో పెట్టుకున్న సమంత సినిమా నుండి తప్పుకోవడంతో మరలా రకుల్‌ప్రీత్‌సింగ్ వచ్చి చేరింది. చివరకు ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్, ప్రణీతలు ఫిక్స్ అయ్యారు.