Advertisementt

తనికెళ్ళ భరణి కథతో క్రేజీ సీక్వెల్!

Fri 28th Aug 2015 05:10 AM
ladies tailor sequel,rajendra prasad,director vamsi,tanikella bharani,raj tarun  తనికెళ్ళ భరణి కథతో క్రేజీ సీక్వెల్!
తనికెళ్ళ భరణి కథతో క్రేజీ సీక్వెల్!
Advertisement
Ads by CJ

రచయితగా సినీరంగ ప్రవేశం చేసి.. నటుడిగా బిజీ అయిన తనికెళ్ల భరణి గత కొంతకాలంగా రచనకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. ‘మిథునం’ చిత్రం దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కథను అందిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లేడీస్ టైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాల హిట్‌లతో ఊపుమీదున్న రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్‌టైలర్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రంతో సీనియర్ దర్శకుడు వంశీ దర్శకుడిగా తన పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలనే కసితో ఉన్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ