నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ ‘అతనొక్కడే’ చిత్రం ద్వారా సురేందర్‌రెడ్డికి దర్శకుడు అవకాశం ఇచ్చి అతని కెరీర్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ చిత్రం ద్వారా కళ్యాణ్‌రామ్ కూడా మంచి కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఆ అనుబంధంతోనే ఇద్దరి కాంబినేషన్‌లో ‘కిక్-2’ వచ్చింది. అయితే ఈ చిత్రానికి నందమూరి హీరో నిర్మాతగా మాత్రమే వ్యవహరించాడు. రవితేజ హీరోగా రూపొందిన ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 50కోట్లు. 25 కోట్ల మార్కెట్ వున్న హీరో చిత్రానికి 50కోట్లకు పైగా ఖర్చుపెట్టడంతో కళ్యాణ్‌రామ్‌కు కష్టాలు వచ్చిపడ్డాయి. తొలిసారిగా ఈ చిత్రం వల్ల దాదాపు సినిమా విడుదల వరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో కళ్యాణ్‌రామ్ అప్‌సెట్ అయ్యాడట. అంతేకాదు ‘పటాస్’ చిత్రంతో వచ్చిన సక్సెస్ ఆనందాన్ని ఆవిరి చేసి సినిమాకు అవసరం లేని ఖర్చుపెట్టించి, విషయం లేని కథతో చిత్రాన్ని తెరకెక్కించి సురేందర్ రెడ్డి నందమూరి హీరోని ముంచేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.