Advertisementt

కోనవెంకట్ అలా.. బాగా సంపాదిస్తున్నాడు!

Thu 27th Aug 2015 08:25 AM
kona venkat,presenter kona venkat,sankarabharanam,kona venkat income  కోనవెంకట్ అలా.. బాగా సంపాదిస్తున్నాడు!
కోనవెంకట్ అలా.. బాగా సంపాదిస్తున్నాడు!
Advertisement
Ads by CJ

రచయితగా కోనవెంకట్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టించుకున్నాడు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా కోనకు మంచి డిమాండే వుంది. అయితే కేవలం రచయితగానే కాకుండా కోనవెంకట్ మరో రూపంలో కూడా బాగానే సంపాదించుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రాజెక్టులు సెట్ చేయడం.. ఆ సినిమాకు తన పేరును సమర్పకుడిగా వేసుకోవడం, సినిమాలో షేర్‌ను తీసుకోవడం కోనవెంకట్ సంపాందనలోని రహస్యమట. అప్పట్లో ‘గీతాంజలి’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన కోన, ప్రస్తుతం నిఖిల్ శంకరాభరణంతో పాటు, నాగచైతన్య-గౌతమ్‌మీనన్ కలయికలో రూపొందుతున్న ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రానికి కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ చిత్రాలకు కోనవెంకట్ డబ్బు రూపంలో పెట్టుబడి ఏమీ పెట్టడని, కేవలం ఆ కాంబినేషన్‌లు సెట్ చేసి అందుకు ఫలితంగా సమర్పణ పేరుతో పాటు సినిమా బిజినెస్‌లో షేర్ తీసుకుంటాడట.. సో. ఏదైనా రైటర్‌గా కంటే ఇలానే కోన సంపాదన బాగుందని వినికిడి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ