Advertisementt

కోన.. రైటరా! కొరియోగ్రాఫరా!

Wed 26th Aug 2015 10:18 AM
kona venkat,sankarabharanam,nikhil,choreographer,nikhil,nanditha  కోన.. రైటరా! కొరియోగ్రాఫరా!
కోన.. రైటరా! కొరియోగ్రాఫరా!
Advertisement
Ads by CJ

'తోకలేని పిట్ట' చిత్రంతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కోనవెంకట్‌ ఆ తర్వాత రైటర్‌గా టర్న్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌రైటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు స్టార్‌రైటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌గా మారాడు. ఇక ఇటీవల వచ్చిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో ముఖానికి మేకప్‌ వేసుకొని నటునిగా కూడా తన ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ పాటకు కొరియోగ్రఫీని అందించి కొరియోగ్రాఫర్‌గా మారాడు. నిఖిల్‌, నందిత జంటగా నటిస్తున్న 'శంకరాభరణం' చిత్రానికి ఈయన నిర్మాణబాధ్యతలతో పాటు కథ, స్క్రీన్‌ప్లే రైటర్‌గా కూడా పనిచేస్తున్నాడు. వైవిధ్యభరితమైన క్రైమ్‌ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌, నందితలపై వచ్చే ఓ పాటకు ఈయన కొరియోగ్రఫీ అందించాడు. ఈ విషయాన్ని నిఖిల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపాడు. ఈ చిత్రానికి ఉదయ్‌ నందనవనం దర్శకుడు కాగా, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ