టాలీవుడ్‌లో కమర్షియల్ యాడ్స్‌లో బిజీగా వున్న స్టార్ ఎవరంటే ఫస్ట్ వినిపించే పేరు మహేష్‌బాబు. ఓ పక్క సినిమాల్లో బిజీగా వుంటూనే లెక్కకు మించిన యాడ్స్ చెయ్యడం ద్వారా నెంబర్‌వన్ అనిపించుకున్నాడు. మహేష్ తర్వాత అల్లు అర్జున్ రెండవ స్థానంలో వుంటాడు. ఓ మోస్తరు యాడ్స్ చేసే వాళ్ళలో నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ పేర్లు వినిపిస్తాయి. ఈమధ్య రవితేజ కూడా రెండు కంపెనీల యాడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఇక ప్రభాస్ కూడా ఓ కమర్షియల్ యాడ్‌తో రాబోతున్నాడు. ఇక అక్కినేని అఖిల్ గురించి చెప్పాలంటే తను హీరోగా నటించిన మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే యాడ్స్‌లో బిజీ అయిపోతున్నాడు. ఆమధ్య టైటాన్ వాచ్ యాడ్‌లో ఫస్ట్ టైమ్ కనిపించిన అఖిల్ ఇప్పుడు మౌంటెన్ డ్యూ యాడ్ కూడా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా అతను కమిట్ అయిన కంపెనీ కార్బన్ మొబైల్స్. దీనికి సంబంధించిన యాడ్స్ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. త్వరలోనే కార్బన్ మొబైల్స్‌ని ప్రమోట్ చేస్తూ కనిపించబోతున్నాడు అఖిల్. ఎక్కువ యాడ్స్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండానే మూడు కమర్షియల్ యాడ్స్ చేస్తున్న హీరోగా అఖిల్ కొత్త రికార్డ్ సృష్టించాడు. అలా తన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మొదలెట్టేశాడు అఖిల్. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కంపెనీలు అఖిల్‌ని అప్రోచ్ అవుతాయో చూడాలి.