'తొలిచూపులోనే' చిత్రంతో హీరోగా పరిచయమైన నందమూరి కళ్యాణ్‌రామ్, ఆ సినిమా తర్వాత చేసిన 'అభిమన్యు' కూడా ఫ్లాప్ కావడంతో తనే ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించి సురేందర్‌రెడ్డిని దర్శకుడుగా పరిచయం చేస్తూ తొలి చిత్రంగా నిర్మించిన 'అతనొక్కడే'తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్‌రామ్. ఆ సినిమా తర్వాత ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చాడు కళ్యాణ్‌రామ్. అయితే నిర్మాతగా సక్సెస్ అవ్వలేకపోయాడు. తనతో అభిమన్యు వంటి ఫ్లాప్ మూవీ తీసిన మల్లికార్జున్‌కి 'కత్తి'తో మరో అవకాశమిచ్చాడు. అయినా అతను సక్సెస్ కాలేకపోయాడు. లేటెస్ట్‌గా తనతో అతనొక్కడే వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నిర్మించిన 'కిక్2' ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. తనతో ఫ్లాప్ సినిమా చేసిన మల్లి కత్తితో మరో ఫ్లాప్ ఇచ్చాడు. తను పరిచయం చేసిన సురేందర్‌రెడ్డి తనకి మరో హిట్ ఇస్తాడని ఆశించిన కళ్యాణ్‌రామ్‌కి రిజల్ట్ రివర్స్ అయింది. నిర్మాతగా కళ్యాణ్‌రామ్ నష్టపోవాల్సి వచ్చింది. తనకి గతంలో రెండు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు మల్లికార్జున్‌తో ఇప్పుడు 'షేర్' సినిమా చేస్తున్నాడు. రెండు ఫ్లాప్‌లిచ్చిన మల్లి ఈసారి కళ్యాణ్‌రామ్‌కి సూపర్‌హిట్ ఇస్తాడో ఫ్లాప్ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తాడో వెయిట్ అండ్ సీ.