మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌లు కలిసి ఓకే సినిమాలో నటిస్తే అది సంచలనం అవుతుంది. అది మెగాఫ్యాన్స్‌కు పండగే అవుతుంది.చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్'చిత్రంలో పవన్‌కళ్యాణ్ కాసేపు కనిపిస్తాడు. అయితే వీరిద్దరితో పూర్తిస్థాయిలో సినిమా చేయాలని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడు. పవన్‌తో సినిమా చేయాలన్నది దిల్‌రాజు ఆశ. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది. దిల్‌రాజుకు సినిమా చేయడానికి పవన్ ఆల్‌రెడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ విషయాన్ని దిల్‌రాజు దృవీకరించాడు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో ఫంక్షన్‌లో దిల్‌రాజుతో ఓ సినిమా చేయాలని ఉందని చిరు తన మనసులోని మాట బయటపెట్టాడు. దానికి దిల్‌రాజు స్పందిస్తూ త్వరలో తాను పవన్‌తో సినిమా చేస్తున్నానని, వీలైతే అందులో చిరంజీవి కూడా నటిస్తారని, అలాంటి కథ కోసం వెదుకుతున్నామని చెప్పి మెగాభిమానులను సంతోషపరిచాడు. అదే నిజమైతే... ఏముంది? మెగా మల్టీస్టారర్ సిద్దమై.. బాక్సులన్నీ బద్దలైపోతాయి అంటున్నారు మెగాభిమానులు.