ఫారెన్‌లో డాలర్ల వేటలో ఉన్న హీరో ఓ అమ్మాయి కోసం ఇండియా వస్తాడు. తనది కాని సమస్యని నెత్తిన వేసుకొని ఓ ఊరిని, అక్కడి ప్రజలను దారిలో పెడతాడు. చిరంజీవి నటించిన 'బావగారూ బాగున్నారా!' చిత్రం స్టోరీలైన్ ఇది. ఇదే కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్ 'బృందావనం'తో పాటు పలు చిత్రాలు వచ్చాయి. అయితే దర్శకుడు హరీష్‌శంకర్ మాత్రం ఇదే ఫార్ములాని మరలా ఎత్తుకొని, సాయిధరమ్‌తేజ్‌తో 'సుబ్రమహ్యం ఫర్ సేల్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుబ్రమణ్యం అనే అమెరికా అబ్బాయి సీత అనే అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయి సమస్యల్ని తీర్చడానికి ఇండియా రావడం, సీత ఇంట్లో ఉన్న సమస్యల్ని, అక్కడి మనుషుల్ని సరి చేయడం ఈ సినిమా మెయిన్ స్టోరీ. చిరు కూడా 'సుబ్రమణ్యం ఫర్‌సేల్' కథ నాకు తెలుసు. బావగారూ.. బాగున్నారా? సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలానే ఈ సినిమా కూడా బాగా ఆడాలని సెలవిచ్చాడు. అంటే చిరు కథని మళ్లీ చిరుకే వినిపించి మెప్పించి ఒప్పించాడు హరీష్‌శంకర్. మరి సేమ్ రిజల్ట్ వస్తుందో లేదో చూడాలి...!