ప్రస్తుతం నాగార్జున-కార్తిల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పివిపి సినిమా సంస్థ ఏకకాలంలో తెలుగు, తమిళంలో నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం ఫ్రెంచ్ సినిమాకు స్ఫూర్తిగా నిర్మితమవుతోంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూరప్ షెడ్యూల్‌ను ముగించుకొని వచ్చిన ఈ చిత్రానికి 'మిత్రుడు, దోస్త్, ఊపిరి ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్‌గా ఈ చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మరి తెలుగు సీనియర్ స్టార్‌తో కలిసి తమిళ యంగ్ స్టార్ చేసే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...!