'బాహుబలి' కంటే ముందే విడుదల కావాల్సిన చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్నామని గుణశేఖర్ ప్రకటించాడు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 4న కూడా విడుదల కాదని, దాంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్‌పై గుణశేఖర్ పెదవి విప్పడం లేదు. దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విషయంలో విడుదల వాయిదాలు పడుతుండటానికి కారణం ఫైనాన్షియర్స్‌కు గుణశేఖర్ ఇప్పటికీ తాను తీసుకున్న మొత్తాలను తిరిగి చెల్లించలేదని, దాంతోనే ఫైనాన్షియర్స్ ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుపడుతున్నారని సమాచారం. అల్లుఅరవింద్ లేదా సురేష్‌బాబు.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రుణిస్తే తప్ప గుణ కష్టాలు తీరవని అంటున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెరకెక్కించిన ఈ చిత్రం లాభాల సంగతి పక్కన పెట్టి అసలు సినిమా విడుదల చేసుకోవడమే కష్టంగా మారిందని చెప్పకతప్పదు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎలాగైనా సెప్టెంబర్ 24న విడుదల చేయాలని గుణశేఖర్ ఆశపడుతున్నాడట. ఈ డేట్ కూడా గుణశేఖర్‌కు కలిసి వచ్చే అవకాశం లేదంటున్నారు. సెప్టెంబర్ 24న దిల్‌రాజు సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దిల్‌రాజు నైజాంలో పంపిణీ చేస్తున్న 'రుద్రమదేవి'ని అదే రోజు విడుదల చేయడం కష్టమని, తన సినిమాపై తన సినిమానే పోటీపడటం దిల్‌రాజుకు ఇష్టం ఉండదు కాబట్టి... గుణశేఖర్ మరో డేట్ వెతుకోవాల్సిందేనని అంటున్నారు.