Advertisementt

చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది.!

Tue 25th Aug 2015 08:47 AM
megastar chiranjeevi 150th movie,chiranjeevi in ramcharan movie,chiranjeevi 151st movie details  చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది.!
చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది.!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే 150వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాని విషయం తెలిసిందే. క్లారిటీ లేని ఈ సినిమా విషయంలో ఒక కొత్త క్లారిటీ వచ్చింది. అదేమిటంటే ఇప్పటివరకు మగధీరతో కలిపి చిరంజీవి హీరోగా, గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలు 149. గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి నటించే 150వ సినిమా ఏమై వుంటుంది, ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు, డైరెక్టర్‌ ఎవరై వుంటారు వంటి ప్రశ్నలు అందర్నీ వేధించాయి. చిరు 150వ సినిమాను డైరెక్ట్‌ చెయ్యాలని ఉవ్విళ్లూరిన డైరెక్టర్లు వున్నారు. తమని ఎక్కడ చెయ్యమంటారో, ఎలా తప్పించుకోవాలని ఆలోచించిన డైరెక్టర్లూ వున్నారు. అయితే ఇప్పుడా బాధ లేదు. ఎందుకంటే చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. 

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి చేసే ఫైట్స్‌కి కంపోజింగ్‌ బాధ్యతను రామ్‌చరణ్‌ తీసుకున్నాడు. ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయం వాస్తవమేనని ఇటీవల చిరంజీవి కూడా అంగీకరించాడు. దీన్ని బట్టి రామ్‌చరణ్‌తో కలిసి చేసే సినిమా చిరంజీవి 150వ సినిమా అవుతుంది కదా. కాబట్టి నెక్స్‌ట్‌ ఆడియన్స్‌గానీ, మెగాస్టార్‌ అభిమానులు గానీ, ఇండస్ట్రీలోని వ్యక్తులు గానీ ఆలోచించాల్సింది చిరంజీవి నటించబోయే 151వ సినిమా గురించి. ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి క్లారిటీ వచ్చే వరకు వెయిట్‌ చెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ