'ఉయ్యాల జంపాల'తో పాటు 'సినిమా చూపిస్తమావ' తో రెండో హిట్‌ను సొంతం చేసుకున్న హీరో రాజ్‌తరుణ్. ఆయన ప్రస్తుతం నాని, సందీప్‌కిషన్, నాగశౌర్య, వరుణ్‌సందేశ్ వంటి హీరోలకు పెద్ద కాంపిటీటర్‌గా తయారై అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కాగా తన నటించి విడుదలైన రెండు చిత్రాలతో ఆయన మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ దృష్టిలో పడ్డాడట. దాంతో రాజ్‌తరుణ్ హీరోగా గీతాఆర్ట్స్2 సంస్థలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ మేరకు ఈ యంగ్‌హీరోకు అడ్వాన్స్ కూడా ముట్టిందట. ఈ చిత్రం ద్వారా మున్నా అనే యువ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని బన్నీ వాసుతో కలిసి మారుతి సంయుక్తంగా నిర్మించనున్నాడట. సో... మెగాకాంపౌండ్ మూవీలో చోటు దక్కించుకోవడంతో ఈ యంగ్ హీరో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడట...!