Advertisementt

మెగాప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా....?

Tue 25th Aug 2015 06:10 AM
chiranjeevi,ram charan,magadheera,sreenuvaitla  మెగాప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా....?
మెగాప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా....?
Advertisement
Ads by CJ

'మగధీర' చిత్రంతో రామ్‌చరణ్‌ టాలీవుడ్‌లో రికార్డులు నెలకొల్పిన సమయానికి ఆయనకు కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. కాగా ఆయన నటిస్తున్న తొమ్మిదవ చిత్రం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈసారి ఎలాగైనా 100కోట్ల క్లబ్‌లో చేరాలని చరణ్‌ ఉబలాటపడుతున్నాడు. 'మగధీర'లో తన తండ్రిని తోడుగా తెచ్చుకొని రికార్డులు క్రియేట్‌ చేసిన చరణ్‌ మరలా పాత సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఈసారి కూడా తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవిని తోడు తెచ్చుకుంటున్నాడు. చిరు రాకతో ఈ చిత్రం ఖచ్చితంగా వందకోట్ల క్లబ్‌లో చేరుతుందని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. కొడుకు మార్కెట్‌ను భారీగా పెంచేందుకు ఈసారి చిరు నడుం బిగించాడు. కాగా ఇటీవల విడుదలైన టీజర్‌ అదుర్స్‌ అనే స్థాయిలో ఉండి... ఈ చిత్రంలో హైఓల్జేజ్‌ యాక్షన్‌ ఎంతగా ఉంటుందో సింపుల్‌గా టేస్ట్‌ చూపించాడు చరణ్‌. మరి చరణ్‌ తన తండ్రి సాయంతో మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ