Advertisementt

ఈసారి మహేష్ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది!

Tue 25th Aug 2015 05:44 AM
mahesh babu,kick2,raviteja,surendar,athithi  ఈసారి మహేష్ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది!
ఈసారి మహేష్ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది!
Advertisement
Ads by CJ

కథలను ఎంచుకోవడంలోనే కాదు... 'వద్దు' అని చెప్పడంలో కూడా హీరోకి జడ్జిమెంట్‌ అవసరం. తమకు సరిపడని స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం కూడా పెద్ద తప్పే. ఇలాంటి తప్పులు తన జీవితంలో కొన్ని చేశాడు మహేష్‌బాబు. కాగా ఇటీవల ఆయనకు తృటిలో అలాంటి మరో గండం తప్పింది. రవితేజ-సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'కిక్‌2'. ఈ కథను మొదట్లో రవితేజకు ముందు మహేష్‌బాబుకు వినిపించి చేయమన్నారట. ఈ చిత్రం తాను చేసిన 'ఖలేజా'తో పాటు అనేక తెలుగు గత చిత్రాలను పోలివుండటంతో మహేష్‌ సురేందర్‌రెడ్డికి నో చెప్పాడట. అందులోనూ సురేందర్‌రెడ్ది చేతిలో ఆల్‌రెడీ ఓ సారి ఆయన బోల్తాపడిన 'అతిథి' కావడం కూడా అందుకు కారణం. దీంతో 'కిక్‌2' స్టోరీకి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి రవితేజ చేత ముద్ర వేయించాడు సురేందర్‌. ఒకవేళ మహేష్‌ ఈసినిమా ఒప్పుకొని ఉంటే ఏమైపోయేదో? అనిపిస్తోంది కదూ...! ఏముంది .. మహేష్‌ ఖాతాలో మరో పెద్ద ఫ్లాప్‌ చేరేది..! మొత్తానికి మహేష్‌ ఖాతాలో ఓ ఫ్లాప్‌ తగ్గినందుకు ఊపిరి పీల్చుకోవాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ