Advertisementt

రెండు వారాల గ్యాప్‌ అందరికీ మంచిది!

Mon 24th Aug 2015 07:40 AM
bahubali,sreemanthudu,ram charan,akhil akkineni  రెండు వారాల గ్యాప్‌ అందరికీ మంచిది!
రెండు వారాల గ్యాప్‌ అందరికీ మంచిది!
Advertisement

'బాహుబలి1' చిత్రం రిలీజ్‌ తర్వాత దాదాపు రెండు వారాలకు పైగా గ్యాప్‌ తీసుకొని మహేష్‌ బాబు 'శ్రీమంతుడు' వచ్చాడు. దీనివల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాలు రెండు పోటీ లేకుండా కలెక్షన్లను కొల్లగొట్టాయి. దీని పరిణామాన్ని గమనించిన రవితేజ 'కిక్‌2' కూడా రెండు వారాల గ్యాప్‌ తీసుకొని వచ్చింది. ఇలా పెద్ద పెద్ద సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్‌ అనేది సురక్షితమైన పద్దతి అని, పోటీకి పోకుండా అందరు రెండువారాల గ్యాప్‌ తీసుకోవాలని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల చేస్తామని సినిమా ప్రారంభంలోనే అనౌన్స్‌ చేశారు. కాగా అక్కినేని అఖిల్‌ డెబ్యూ మూవీని అక్టోబర్‌ 21న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే నష్టపోయేది కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అఖిలే అని.. కాబట్టి అఖిల్‌ రామ్‌చరణ్‌ సినిమాకు రెండు వారాల ముందుగానీ, లేదా రెండు వారాల తర్వాత కానీ వస్తే బాగుంటుందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి దసరా సీజన్‌ను ఎవరు మిస్‌ చేసుకోవడానికి ఇష్టపడరని అందువల్ల ఈ రెండు చిత్రాల మధ్య రెండువారాల గ్యాప్‌ జరిగే పని కాదని కొందరు వాదిస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement