Advertisementt

'పులి'కి వాతలు తప్పవా?

Sun 23rd Aug 2015 09:53 AM
puli movie,vijay,chimbu devan,sruthihassan  'పులి'కి వాతలు తప్పవా?
'పులి'కి వాతలు తప్పవా?
Advertisement
Ads by CJ

తమిళ స్టార్‌ విజయ్‌, శృతిహాసన్‌,హన్సిక, సుదీప్‌, అతిలోక సుందరి శ్రీదేవిల కాంబినేషన్‌లో చింబుదేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పులి'. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలయిందో లేదో 24గంటల లోపే 10లక్షల హిట్స్‌ వచ్చాయి. అవి గంట గంటకు ఇంకా పెరుగుతున్నాయి. ట్రైలర్స్‌లో ఇదో కొత్త రికార్డు అనే చెప్పాలి. అయితే 'పులి' ట్రైలర్‌లో మాత్రం పెద్దగా మేటర్‌ లేదని విజయ్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహపడుతున్నారు. ఏదో గ్రాఫిక్స్‌ హంగులతో భారీ సెట్లతో హంగామా చేశారు కానీ, అంత కిక్‌ లేదని తేల్చేస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి వీడియో గేమ్‌ తీశారేమిటబ్బా? అంటూ మరలా యాంటీ విజయ్‌ ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. 'బాహుబలి' సినిమాలా గ్రాండియర్‌గా ఉంటుంది అని అనుకుంటే... ఆ స్థాయి మేకింగ్‌ కనిపించకపోవడం విజయ్‌ అభిమానులను షాకింగ్‌కు గురి చేస్తోంది. మరి సినిమాలో అయినా మేటర్‌ ఉంటుందో లేదో అని విజయ్‌ ఫ్యాన్స్‌లో టెన్షన్‌ మొదలైంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ