టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో ఎవరని చెప్పడం కష్టమేమో కానీ.. క్రేజీ హీరోలు ఎవరంటే మాత్రం ఎవరి నోటి నుంచైనా ముందుగా వచ్చే పేర్లు పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు. అంతగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ స్టార్‌డమ్‌ని పెంచుకున్న ఈ ఇద్దరు హీరోల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మహేష్ కంటే ఓ మెట్టు మీదుండే పవన్.. పొలిటికల్‌గానూ తన మార్కు చూపిస్తున్నాడు. మొదటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యాంటీగా ఉన్న పవన్ రాజధాని భూసేకరణ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా యాంటీగా మారుతున్నట్లు పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఓ వైపు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ వ్యతిరేకంగా మారుతుంటే మహేష్ మాత్రం ఇద్దరికీ దగ్గరవుతున్నాడు. మహేష్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నా.. రీసెంట్‌గా ఆయన నటించిన 'శ్రీమంతుడు' సినిమాతో ఇద్దరు చంద్రులకు క్లోజ్ అయ్యాడు. మహేష్ తన తండ్రి సొంత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని డిసైడయ్యాడు. అంతేకాదు... తెలంగాణలోనూ ఓ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇలా ఇద్దరు చంద్రుల మద్దతు మహేష్‌కు ఉన్నట్లేనని పరిణామాలను చూస్తే అర్థం అవుతోంది. ఏదిఏమైనా పవన్, మహేష్‌లు చేరో దారిలో వెళుతూ తమ టార్గెట్‌ను రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.