రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'కిక్2' విడుదలైంది. రవితేజ సంపత్‌నందితో చేస్తున్న 'బెంగాల్‌టైగర్' చిత్రం కూడా వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే రవితేజ తన తదుపరి చిత్రాలపై ఇప్పటికీ నోరు విప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం రవితేజ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటించే చిత్రం మొదలవుతుందని అంటున్నారు. సుధీర్‌వర్మ రవితేజకు స్టోరీలైన్ చెప్పింది 'దోచెయ్'కు ముందు. కానీ 'దోచెయ్' చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రవితేజ సుధీర్‌వర్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక రవితేజతో సినిమాలు చేసే దర్శకుల లిస్ట్‌లో సంతోష్‌శ్రీనివాస్, వీరుపోట్ల వంటి దర్శకులు కూడా ఉన్నారు. మరి రవితేజ తదుపరి చిత్రంగా ఏది సెలక్ట్ చేసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.