వాస్తవానికి మహేష్‌బాబు పుట్టకముందే ఆయన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పద్మాలయా స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించాడు. వాటిల్లో అధికశాతం చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చినప్పటికీ ఆర్థికంగా చూసుకుంటే మాత్రం బాగా దెబ్బతిన్నాడు. ఆ తర్వాత మహేష్ హీరోగా మారిన తర్వాత ఆయన సోదరుడు రమేష్ బాబు, ఆయన సోదరి మంజుల వంటివారు ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి మహేష్‌తో సినిమాలు తీశారు. అయితే వారికి కూడా ఆర్థికంగా ఆయా చిత్రాలు ఏమీ మిగల్చలేదు. సో.. వారందరినీ పక్కన పెట్టిన మహేష్ ఇప్పుడు తానే నిర్మాతగా తన పేరుమీదనే ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి, 'శ్రీమంతుడు'తో నిర్మాతగా మారాడు. తొలి సినిమాతోనే లాభాలు సంపాదించాడు. మొత్తానికి ఘట్టమనేని ఫ్యామిలీకి నిర్మాణరంగం సరిగ్గా కలిసి రాలేదు. మరి నిర్మాతగా మారిన మహేష్ అయినా ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా? అనేది చూడాలి. అయినా తన కుటుంబంలో ఇన్ని సంస్థలు ఉన్నా వాటిపై కాకుండా మహేష్ సొంతగా తన పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు మాత్రం తన కుటుంబ సభ్యులపై నమ్మకం లేకనే భార్య మద్దతుతో మహేష్ నిర్మాతగా మారినట్లు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.