Advertisementt

దిల్‌రాజు మరో చిత్రం!

Sat 22nd Aug 2015 06:12 AM
dil raju,josh,vasu varma,hareesh shankar,venusriram  దిల్‌రాజు మరో చిత్రం!
దిల్‌రాజు మరో చిత్రం!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు పేరు వినగానే ఆయన జడ్జిమెంట్‌, కమిట్‌మెంట్‌ వంటివి గుర్తుకు వస్తాయి. అంతేకాదు.. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్లను సరిగ్గా వాడుకోవడంలో ఆయన సిద్దహస్తుడు. వాసువర్మతో నాగచైతన్య డెబ్యూ మూవీ 'జోష్‌' చిత్రాన్ని ఆయన నిర్మించాడు. అయినా సినిమా బాగా ఆడలేదు. కానీ వాసువర్మలోని టాలెంట్‌ను గమనించిన దిల్‌రాజు మాత్రం తాజాగా సునీల్‌తో చేస్తున్న చిత్రానికి వాసువర్మనే నమ్మి పగ్గాలు అందించాడు. ఇక హరీష్‌శంకర్‌తో ఆయన తీసిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయినప్పటికీ మరలా హరీష్‌శంకర్‌కే సాయి ధరమ్‌తేజ్‌తో తెరకెక్కుతోన్న 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాన్ని తీస్తున్నాడు. కాగా దిల్‌రాజు అప్పుడెప్పుడో వేణు శ్రీరామ్‌ అనే నూతన దర్శకుడితో సిద్దార్ధ్‌ హీరోగా 'ఓ మై ఫ్రెండ్‌' తీశాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. అయినా కానీ ఆయనకు వేణుశ్రీరామ్‌పై ఎంతో నమ్మకం ఉంది. కాగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు రవితేజ హీరోగా ఓ సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడని సమాచారం. అంతేకాదు... ఇకపై చిన్న సినిమాల నిర్మాణం తగ్గించుకొని మీడియం హీరోలతో లేదా స్టార్‌హీరోలతోనే చిత్రాలు తీయాలని లేటెస్ట్‌గా దిల్‌రాజు నిర్ణయించుకున్నాడట. చిన్న సినిమాలు ఎంత బాగున్నా ప్రేక్షకులను థియేటర్‌ వరకు రప్పించడం కష్టం అవుతోందని, అదే మీడియం, స్టార్‌ హీరోల చిత్రాలకైతే ఆటోమేటిగ్గా ప్రేక్షకులు తరలివస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ