Advertisementt

పవన్ రెండు లక్షల పుస్తకాలను చదివాడా!

Fri 21st Aug 2015 08:35 AM
pawankalyan,pawanijam,sreekanth,books,chiranjeevi  పవన్ రెండు లక్షల పుస్తకాలను చదివాడా!
పవన్ రెండు లక్షల పుస్తకాలను చదివాడా!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ ఎవరి ఇమేజ్ కు తగ్గట్లు వారికి అభిమానులు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 'పవనిజం' అనే పేరుతో ఒక ఇజాన్ని క్రియేట్ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ అభిమానైన శ్రీకాంత్ ఆయన మీద ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధన జరిపి ఓ పుస్తకాన్ని రచించాడు.ఈ పుస్తకంలో పవన్ భావజాలానికి సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయమై శ్రీకాంత్ పలుమార్లు పవన్ తల్లితండ్రులను, సోదరులు చిరంజీవి, నాగబాబులను కలిసి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. 

ఈ పరిశోధనలో పవన్ ఇప్పటివరకు రెండు లక్షల పుస్తకాలను చదివినట్లు తెలుసుకున్నాడట. పవన్ కళ్యాణ్ ఆలోచనలపై రమణ మహర్షి ప్రభావం ఎంతగా ఉందో ఈ పుస్తకంలో తెలిపినట్లుగా రచయిత వెల్లడించాడు. అతి త్వరలోనే 'పవనిజం' పేరుతోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తారని సమాచారం. ఈ పుస్తకం పవన్ అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ