Advertisementt

10కోట్ల క్లబ్‌లోకి చేర్చిన శ్రీమంతుడు!

Thu 20th Aug 2015 02:55 AM
koratala siva,mirchi,srimanthudu,10 crores club  10కోట్ల క్లబ్‌లోకి చేర్చిన శ్రీమంతుడు!
10కోట్ల క్లబ్‌లోకి చేర్చిన శ్రీమంతుడు!
Advertisement
Ads by CJ

రచయితగా మంచి పేరు సంపాదించుకొని, 'మిర్చి' సినిమాతో దర్శకునిగా తొలి సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన తాజాగా మహేష్‌బాబుతో చేసిన 'శ్రీమంతుడు' చిత్రం ఘనవిజయం సాధిస్తోంది. టాలీవుడ్‌ దర్శకులను వెంటాడే ద్వితీయ విఘ్నంను సైతం ఆయన అధిగమించి తన సత్తా నిరూపించుకున్నాడు. కాగా ఇప్పుడు ఆయన తన మూడో చిత్రానికి 10 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇలా మూడో సినిమాతోనే 10కోట్ల క్లబ్‌లో కొరటాల చేరడం కొందరికి ఆనందాన్ని, మరికొందరికి మాత్రం అసూయను కలిగిస్తోంది. ఇప్పటివరకు 10కోట్ల క్లబ్‌లో రాజమౌళి, వినాయక్‌, పూరీజగన్నాథ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, బోయపాటి శ్రీను.. వంటి వారు ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన కొరటాలకు చోటు దక్కింది. మొత్తానికి 'శ్రీమంతుడు' చిత్రం దర్శకుడు కొరటాల శివను 'శ్రీమంతుడు'గా మార్చిందని చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ