Advertisementt

మహేష్‌ 100కోట్ల సినిమా ఎప్పుడు?

Wed 19th Aug 2015 01:02 AM
mahesh babu,sreemanthudu,brahmothsawam,trivikram sreenivas  మహేష్‌ 100కోట్ల సినిమా ఎప్పుడు?
మహేష్‌ 100కోట్ల సినిమా ఎప్పుడు?
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు' తెలుగులో సూపర్‌హిట్టు అయింది. ప్రస్తుతం మహేష్‌ ఆ ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నాడు. తన తర్వాతి చిత్రాన్ని అంటే 'బ్రహ్మూెత్సవం' సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి బేనర్‌పై త్వరలో సెట్స్‌ మీదకు తీసుకుపోనున్నాడు. కాగా ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్‌ చేయబోయే తదుపరి చిత్రం ఏమిటి? అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఆయనకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో, పూరీజగన్నాథ్‌తో, మురుగదాస్‌లతో ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే మహేష్‌ మాత్రం 'బ్రహ్మూెత్సవం' చిత్రం తర్వాత డి.వి.వి.దానయ్య సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి వినాయక్‌ డైరెక్టర్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వందకోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దానయ్య నిర్మించబోతున్నాడట. మహేష్‌ 'బ్రహ్మూెత్సవం' పూర్తయ్యే సరికి డివివి దానయ్య నిర్మిస్తున్న శ్రీనువైట్ల-రామ్‌చరణ్‌ల సినిమాతో పాటు, వినాయక్‌-అఖిల్‌ మూవీ కూడా పూర్తవుతుంది. సో.... తమ తమ తాజా చిత్రాలు పూర్తయిన వెంటనే వినాయక్‌-దానయ్యలు మహేష్‌ సినిమా స్క్రిప్ట్‌పైనే కూర్చుంటారని సమాచారం. ఇది పక్కన పెడితే మహేష్‌ 'శ్రీమంతుడు' తమిళంలో పెద్ద ఫ్లాప్‌ అయినందున ముందుగా చెప్పినట్లు పివిపి సంస్థ 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తుందా? లేక కేవలం తెలుగుకే పరిమితం అవుతుందా?అనేది వేచిచూడాల్సిన విషయం...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ