టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమా అనగానే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అది హీరోయిన్ అయినా, లేక ఐటమ్‌గర్ల్ అయినా సరే సంబరపడిపోతారు. నటి పూర్ణ కూడా మహేష్‌తో సినిమా అనగానే ఎగిరిగంతేసింది. మహేష్ సినిమాలో ప్రత్యేక గీతం అనగానే కాల్షీట్స్ ఇచ్చేసింది. 'శ్రీమంతుడు'లో పూర్ణ ఐటం చేస్తోంది అనగానే అందరూ ఆశ్యర్యపడిపోయారు. ఇక నుంచి పూర్ణ జాతకం సూపర్‌స్పీడ్‌తో దూసుకెళ్లుతుందని జోస్యం చెప్పారు. 'శ్రీమంతుడు' సినిమా విడుదలై సూపర్‌హిట్ అయింది. అయినా పూర్ణకి ఏమీ కలిసి రాలేదు. కనీసం పూర్ణను తలచుకొన్న వారు కూడా లేరు. ఎందుకంటే 'రామ రామ' గీతంలో పూర్ణ అలా మెరిసి ఇలా మాయమైంది. తను పూర్ణ అన్న సంగతి ఆడియన్స్‌కు రిజిష్టర్ కూడా కాలేదు. కనీసం మహేష్ పక్కన నిలబడి ఓ స్టెప్పు కూడా వేయలేకపోయింది. ఏదో గ్రూప్‌డ్యాన్సర్లలో ఒకత్తిగా కనిపించిందంతే. ఈ సినిమాతో తన లక్ మారుతుందని భావించిన పూర్ణకు ఆశలు అడియాసలే అయ్యాయి. పాపం.. పూర్ణ...!