'ఉయ్యాల జంపాల' చిత్రంతో అందరి దృష్టిలో పడిన యంగ్ హీరో రాజ్ తరుణ్. గోదారి యాస, కంఫర్ట్‌బుల్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'సినిమా చూపిస్త మావా' చిత్రంతో మరో హిట్ కొట్టాడు. ఈ చిత్రం బి,సి సెంటర్లలో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అంతేకాదు.. ఈ చిత్రానికి విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. బయ్యర్లు కూడా ఖుషీగా ఉన్నారు. దీంతో రాజ్‌తరుణ్ కెరీర్ మంచి ఊపందుకోనుందని విశ్లేషకులు అంటున్నారు. కామెడీ, కాస్త మాస్ కలగలిసిన కథలకు రాజ్‌తరణ్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అందులో కుర్రాడు కాబట్టి లవ్‌స్టోరీలకు కూడా ఓకే అంటున్నారు. ఇంతవరకు ఇదే జోనర్‌ను నమ్ముకొని సినిమాలు చేస్తున్న అల్లరినరేష్, సునీల్ వంటి వారికే కాదు.. ఇటీవల వస్తున్న కుర్రహీరోలకు ఈ హీరో మంచి కాంపిటీటర్‌గా తయారయ్యాడు. ఇంతవరకు ఇతర హీరోలకు అనుగుణంగా కథలు రాసుకుంటున్న కథలకు రాజ్‌తరుణ్ కూడా బెస్ట్ ఆప్షన్ అవుతాడనడంలో సందేహం లేదు. మరి వరుసగా రెండు హిట్లు ఇచ్చిన రాజ్‌తరుణ్ ఈ చిత్రాల ద్వారా తనకు వచ్చిన ఇమేజ్‌ను, క్రేజ్‌ను ఎలా కాపాడుకుంటాడు? ఆయన వ్యక్తిగత బిహేవియర్, క్రమిశిక్షణ, రెమ్యూనరేషన్ వద్ద నిర్మాతలను ఇబ్బంది పెట్టడం వంటివి చేయకుడా ఉంటే బాగుంటుందని, దానిని బట్టే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!