మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం 100కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాతలు హక్కులు తమ వద్దే ఉంచుకోకుండా 80కోట్లకు ఈరోస్ సంస్థకు అమ్మేశారు. దాంతో 80కోట్లకు పైగా వచ్చిన లాభాలన్నీ ఈరోస్ సంస్థ జేబుల్లోకి వెళ్లతాయి. నిర్మాతలు కొత్తవారు కావడం, మహేష్ కూడా కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన మొదటి సినిమా కావడం, మహేష్ గత చిత్రాలు సాధించిన పరాజయాలను, ఆయా నిర్మాతలు నష్టపోయిన విధానాన్ని చూసిన మైత్రీ మూవీస్ అధినేతలు ఇలా తొందరపడి హోల్‌సేల్‌గా అమ్మేశారని, అదే ఆ రైట్స్‌ను తమ వద్దే ఉంచుకుంటే మరో 20కోట్లు లాభాలు ఖచ్చితంగా వచ్చేవని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.