మహేష్‌బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా విడుదలకు దాదాపు నెల ముందు నుండే పబ్లిసిటీని పెంచి, మీడియాలో నిరంతరం కనిపిస్తూ ఉండటం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. అయితే సినిమా విడుదలై ఘనవిజయం దిశగా సాగుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలను ఆపలేదు. రోజురోజుకు పబ్లిసిటీని మరింత ఉదృత్తం చేస్తున్నారు. సినిమా విడుదలై సూపర్‌హిట్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ మాత్రం తొలిసారిగా పబ్లిసిటీని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ఓవరాల్‌గా 100కోట్లు వసూలు చేసింది. థియేటర్ల ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు.. ఇతరత్రాలను తీసివేస్తే ఈ చిత్రం షేర్ 60కోట్లకు పైగానే ఉంది. అయినా కూడా ఈ చిత్రాన్ని ఎలాగైనా శాటిలైట్‌తో కలిపి 100కోట్ల దిశగా సాగాలని నిర్ణయించడంతో పబ్లిసిటీని మరింతగా పెంచుతున్నారని, దీంతో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని రెండో వారం కూడా స్టడీ కలెక్షన్లు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు.