Advertisementt

మరోసారి పవన్‌ నామజపం!

Mon 17th Aug 2015 06:47 AM
pawan kalyan,nithin,courier boy kalyan,gautham menon  మరోసారి పవన్‌ నామజపం!
మరోసారి పవన్‌ నామజపం!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నామజపం చేసే హీరోల్లో నితిన్‌ ముందు వరుసలో ఉంటాడు. ఈ విషయంలో నితిన్‌ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు 'కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌'లో కూడా నితిన్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడట. ఇందులో నితిన్‌-యామీగౌతమ్‌ జంటగా నటించగా, ప్రేమ్‌సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. గౌతమ్‌ మీనన్‌ నిర్మాత. ఈ చిత్రంలో పవన్‌ ప్రస్తావన ఉన్నట్లు గౌతమ్‌మీనన్‌ కూడా అంగీకరించాడు. ఆయన మాట్లాడుతూ... ఈ టైటిల్‌లో కళ్యాణ్‌ అని పెట్టడానికి కారణం నితినే. తను పవన్‌కు పెద్ద ఫ్యాన్‌. అందుకే టైటిల్‌ను 'కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌' అని పెట్టాం. అంతేకాదు... ఈ సినిమాలో పవన్‌ పేరును ప్రస్తావిస్తూ ఓ డైలాగ్‌ కూడా ఉంది. ఇది అందరి చేత చప్పట్లు కొట్టేలా చేస్తుంది...అంటున్నాడు గౌతమ్‌మీనన్‌. సో.. పవన్‌ ఫ్యాన్స్‌కు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ