Advertisementt

అందరినీ ఆకట్టుకుంటోన్న 'కంచె' టీజర్‌!

Mon 17th Aug 2015 06:15 AM
kanche movie,mukunda,varun tej,director krish  అందరినీ ఆకట్టుకుంటోన్న 'కంచె' టీజర్‌!
అందరినీ ఆకట్టుకుంటోన్న 'కంచె' టీజర్‌!
Advertisement
Ads by CJ

తన తొలి చిత్రంగా క్లాస్‌ మూవీ అయిన 'ముకుంద'ను చేసిన వరుణ్‌తేజ్‌ను, సెకండ్‌ మూవీకి కూడా క్రిష్‌ దర్శకత్వంలో చేస్తుండటం చూసి చాలా మంది నవ్వుకున్నారు. పిల్లాడిని సరైన అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శించారు. కానీ ఇటీవల విడుదలైన 'కంచె' టీజర్‌ చూసిన వారు మాత్రం తమ అంచనాలు తప్పని ఇప్పుడే ఒప్పుకొంటున్నారు. ఈ చిత్రం టీజర్‌ అద్భుతంగా ఉందని, ఈ సినిమా మంచి విజయం సాధించడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1940 నాటి కథాంశం కావడం... ఇందులో వరుణ్‌తేజ్‌ సైనికుడిగా నటిస్తుండటం చూస్తే ఈ సినిమా యుద్దం-ప్రేమకథల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిందని అర్థం అవుతోంది. ఈ టీజర్‌ చూసిన వారు మాత్రం ముక్తకంఠంతో ఈ సినిమా అందరినీ మెప్పించి కమర్షియల్‌గా విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందడం ఖాయమని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ