Advertisementt

పవన్‌కి, దాసరికి త్రివిక్రమ్‌ కథ అవసరమైందట.!

Mon 17th Aug 2015 02:49 AM
pawan kalyan and dasari combo movie details,trivikram subject to pawan and dasari  పవన్‌కి, దాసరికి త్రివిక్రమ్‌ కథ అవసరమైందట.!
పవన్‌కి, దాసరికి త్రివిక్రమ్‌ కథ అవసరమైందట.!
Advertisement
Ads by CJ

ఎన్నో విభిన్నమైన కథలతో, ఎన్నో మరపురాని చిత్రాలు రూపొందించిన దర్శకరత్న డా|| దాసరి నారాయణరావుకి ఇప్పుడు మరో స్టార్‌ రైటర్‌ కథ అవసరమొచ్చిందట. పవన్‌ కళ్యాణ్‌, దాసరి నారాయణరావు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అది నిజం కాదని, రూమర్‌ అని కొట్టి పారేసిన వాళ్ళు కూడా వున్నారు. అయితే దాసరి బర్త్‌డేకి పవన్‌ కళ్యాణ్‌ దాసరి ఇంటికి వెళ్ళి విషెస్‌ చెప్పడమే కాకుండా ఇద్దరూ చాలా సేపు సమావేశమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వుంటుందని కన్‌ఫర్మ్‌ అయింది. వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమాకి త్రివిక్రమ్‌ కథ అందించబోతున్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. 
పవన్‌, దాసరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది మంచి పవర్‌ఫుల్‌గా వుండడమే కాకుండా సొసైటీకి చక్కని మెసేజ్‌ ఇచ్చేదిగా వుండాలని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నాడట. అందుకే సబ్జెక్ట్‌ రెడీ చేసే బాధ్యత త్రివిక్రమ్‌కి అప్పగించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి దాసరి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని, దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్‌ అవ్వలేదని మరో వార్త కూడా వినిపిస్తోంది. అఫీషియల్‌గా ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ