Advertisementt

మెగాస్టార్‌కు తమిళస్టార్‌ అడ్డు!

Sun 16th Aug 2015 04:39 AM
chiranjeevi,katthi movie,tagore madhu,dil raju,vijay  మెగాస్టార్‌కు తమిళస్టార్‌ అడ్డు!
మెగాస్టార్‌కు తమిళస్టార్‌ అడ్డు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ సినిమాగా తమిళ 'కత్తి' రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్య్లంలో 'కత్తి' అనువాద హక్కులను పొందిన ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి రీమేక్‌ చేయనున్నాడని అంటున్నారు. అయితే ఠాగూర్‌ మధు... తమిళంలో 'కత్తి'ని నిర్మించిన లైకా మూవీస్‌ అధినేతల నుండి కేవలం అనువాద హక్కులను మాత్రమే తీసుకున్నాడని, రీమేక్‌ రైట్స్‌ను మాత్రం ఇప్పటికీ తీసుకోలేదని తెలుస్తోంది. కాగా తమిళంలో స్టార్‌ హీరోగా వున్న విజయ్‌... తాజాగా తన ఇమేజ్‌ను తెలుగులో కూడా సంపాదించాలని కోరుకుంటున్నాడని, అందువల్ల ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా అధినేతలను కేవలం అనువాదం మాత్రమే చేయాలని, రీమేక్‌ చేయకూడదని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన తమిళ 'జిల్లా' చిత్రం తెలుగు అనువాదం కూడా ఫర్వాలేదనిపంచే విధంగా కొన్నవారికి లాభాలు తేవడంతో విజయ్‌ 'కత్తి'ని కేవలం డబ్‌ చేయాలని షరత్తు విధిస్తున్నాడని, టెక్నికల్‌గా ఠాగూర్‌ మదు వద్ద రీమేక్‌ హక్కులు లేకపోవడం ఇప్పుడు ఈ ఇబ్బందులకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మురుగదాస్‌తో చిరుకు మంచి అనుబంధం ఉండటంతో ఈ విషయాన్ని సెటిల్‌ చేసేందుకు విజయ్‌ను ఒప్పించమని ఒత్తిడి మొదలైందని.. అందుకు మురుగదాస్‌ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యాడని సమాచారం. మొత్తానికి ఏ విషయం చిరు బర్త్‌డే నాటికి సెటిలవుతుందని మెగాక్యాంప్‌ భావిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ