సూపర్‌స్టార్ మహేష్ హీరోగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'శ్రీమంతుడు' ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయి టాక్ పరంగా, కలెక్షన్లపరంగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం సాధించిన విజయంపై సూపర్‌స్టార్ మహేష్ స్పందిస్తూ.. ''కథని నమ్మి చేసాను. శివగారు మంచి కథ రాసారు. అందరం కథని ఫాలో అయ్యాం. మంచి కథకు టీమ్ వర్క్ తోడయితే ఎంత పెద్ద విజయం వస్తుందో 'శ్రీమంతుడు' నిరూపించింది. నాన్న, అన్నయ్య, బాబాయ్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చింది. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆడియన్స్ ముఖ్యంగా నా అభిమానులు ఈ విజయానికి ఎంతో ఆనందపడుతున్నారు. నా జీవితంలో ఈ బర్త్‌డే రియల్‌గా చాలా హ్యాపీగా వున్న బర్త్‌డే. ఈ సక్సెస్‌తో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి నాకు ఉత్సాహం వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ విజయానికి కొరటాల శివగారు ముఖ్య కారకులు. ఆయనే ఈ సినిమాకి హీరో అని నా ఫీలింగ్. తొలి చిత్రం అయినా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం కాంప్రమైజ్ అవకుండా తీసారు. అన్ని విధాలా నేను సంతృప్తి చెందిన చిత్రం 'శ్రీమంతుడు'. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిలిమ్ 'శ్రీమంతుడే'' అన్నారు.