సమంతకు మరో భారీ ఆఫర్‌!

టాలీవుడ్‌ మాట ఎలా ఉన్నా.. తన పుట్టినిల్లు కోలీవుడ్‌లో సమంత వరుస అవకాశాలను సాధిస్తూ దూసుకెళుతోంది. ఆమె ఇప్పటికే సూర్య, విజయ్‌, విక్రమ్‌ల సరసన నటించింది. ధనుష్‌ సరసన 'విఐపి2'లో నటిస్తోంది. ఈ చిత్రం పూర్తికాకముందే ఆమెకు మరో భారీ ఆఫర్‌ వెత్తుకుంటూ వచ్చింది. 'విఐపి2'లో సమంత నటనకు ఫ్లాటైన ధనుష్‌ తన తదుపరి చిత్రంలో కూడా ఆమెనే సజెస్ట్‌ చేశాడు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో 'వాడా చెన్నై' అనే చిత్రం ధనుష్‌-సమంతల కాంబినేషన్‌లో మొదలుకానుంది. ఈ చిత్రం సౌత్‌ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది. కాగా ఈచిత్రం షూటింగ్‌ సెప్టెంబర్‌ నుండి మొదలుకానుంది. సమంత ప్రస్తుతం తెలుగులో కూడా రెండు చిత్రాలు చేయడానికి సైన్‌ చేసింది. మహేష్‌బాబు సరసన 'బ్రహ్మూెత్సవం' తో పాటు త్రివిక్రమ్‌-నితిన్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో కూడా సమంతనే నటిస్తున్న సంగతి తెలిసిందే. 

samantha
kollywood
vijay
vikram
dhanush
vip2 movie