Advertisementt

అసూయపడుతోన్న నాగ్‌!

Fri 14th Aug 2015 06:40 AM
nagarjuna,bahubali,vijayendhraprasad,rajanna  అసూయపడుతోన్న నాగ్‌!
అసూయపడుతోన్న నాగ్‌!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని చిత్ర సీమలను బుట్టలో వేసుకొంది 'బాహుబలి' చిత్రం. ఇలాంటి సినిమాలో నాకు ఛాన్స్‌ రాలేదేంటి? అని చాలా మంది బాధపడ్డారు. కొంతమంది అయితే ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా అదే అంటున్నాడు. ఈ సినిమాలో నటించిన వాళ్లను చూస్తుంటే నాకు అసూయ కలుగుతోంది అన్నాడు. ఇలాంటి చిత్రాలు తన దగ్గరకు వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నానని.... అంతేకాదు... తనకు రావణాసురుడిగా చేయాలని ఉందని, ఒకే పాత్రలో భిన్న పార్శ్వాలు చూపించే అవకాశం రావణాసరుడి పాత్రలో దొరుకుతుందని, అలాంటి పాత్ర లభిస్తే వదులుకోనని అంటున్నాడు. అయితే ఇక్కడ రాజమౌళి విషయంలో నాగ్‌ ఓ విషయం మర్చిపోయాడు. రాజమౌళి ఇప్పటివరకు అందరూ యంగ్‌ స్టార్‌హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించిన 'రాజన్న' చిత్రానికి యాక్షన్‌ సీన్స్‌ను తీసింది స్వయాన రాజమౌళి అన్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌ సమయంలోనే నాగ్‌తో కాస్త ఇబ్బంది పడిన రాజమౌళి తాను యంగ్‌ స్టార్‌ హీరోలతో చేస్తానే తప్ప, సీనియర్‌ స్టార్‌ హీరోలతో మాత్రం చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ