'బాహుబలి2'లో దేవసేన పాత్రలో అలరించనున్న అనుష్క త్వరలోనే ఓ వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సైజ్‌జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషాచిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లోగోను విడుదల చేశారు. ఈ లోగోని అనుష్క షేర్ చేసింది. పివిపి సంస్థ నిర్మాణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ చిత్రం కోసం అనుష్క 20 కిలోలు పెరిగి, మరలా నార్మల్ వెయిట్‌కు వచ్చింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి మొదలైన వారు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.