Advertisementt

తమిళ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ ద్విభాషా చిత్రం.!

Wed 12th Aug 2015 06:07 AM
ntr murugados combo movie,ntr next movie details,director murugados,ntr movie in telugu and tamil  తమిళ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ ద్విభాషా చిత్రం.!
తమిళ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ ద్విభాషా చిత్రం.!
Advertisement
Ads by CJ

ఇప్పుడున్న టాప్‌ హీరోలందరూ ఏదో ఒక టైమ్‌లో తమిళ డైరెక్టర్లతో కూడా వర్క్‌ చేశారు. కానీ, ఎన్టీఆర్‌ మాత్రం చేసిన సినిమాలన్నీ తెలుగు డైరెక్టర్లతో చేసినవే. బాహుబలి, శ్రీమంతుడు వంటి సినిమాలు ఏకకాలంలో తమిళ్‌లో కూడా విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ తమిళ్‌ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆర్‌లాంటి హీరో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్‌ కూడా స్టార్‌ డైరెక్టర్‌ అయి వుండాలి. అలాంటి స్టార్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా దగ్గరైన డైరెక్టర్లలో మురుగదాస్‌ ఒకడు. అతనైతేనే తను చెయ్యబోయే సినిమా రెండు భాషల్లోనూ పూర్తి న్యాయం చెయ్యగలుగుతాడని నమ్ముతున్న ఎన్టీఆర్‌ అతనితో తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారన్న వివరాలు తెలియనప్పటికీ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ