నిన్నటివరకు ఉన్న ట్రెండ్ ఏమిటంటే.. ఎంతటి స్టార్‌హీరో సినిమా అయినా సరే బ్రహ్మానందం ఉంటేనే హిట్టవుతుందని భావించేవారు. దాంతో బ్రహ్మీ కూడా తాను నటిస్తేనే సినిమాలు హిట్టు అవుతాయనే ఉద్ధేశ్యంతో గొంతెమ్మ కోరికలు కోరడం, స్టార్‌హీరోలను కూడా లెక్కచేయని స్థితిలో ఉన్నాడు. దీంతో బ్రహ్మా ఉంటేనే సినిమాలు ఆడుతాయనే ట్రెండ్‌కు బ్రేక్ వేయాలని మన స్టార్‌హీరోలు భావిస్తున్నారట. అందుకే తమ తమ చిత్రాల్లో బ్రహ్మీ లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇటీవల వచ్చి ఘనవిజయాలు సాధిస్తున్న 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాల్లో బ్రహ్మీ లేడు. చివరకు శ్రీనువైట్ల-రామ్‌చరణ్ మూవీలో కూడా బ్రహ్మానందం లేకపోవడం గమనార్హం. అలాగే పవన్‌కళ్యాణ్ 'సర్దార్'లో కూడా ఆయనకు చోటు లేకుండా చేశారు. మరి ఆయన లేకుండా ఉన్నంత మాత్రాన మా సినిమాలు ఆడవా? అని అందరు స్టార్స్ తమలో తాము ప్రశ్నించుకొని ఇలా చేస్తుండటం గమనార్హం. మరి ఈ రెండు వాదనల్లో ఏది కరెక్ట్? అనేది వీక్షకులే నిర్ణయించాలి...!