ఇటీవల వరుసగా పెద్ద పెద్ద స్టార్‌హీరోలు, బారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే తాజాగా రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి. అందులో ఒకటి 'సినిమా చూపిస్త మావా' చిత్రం. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాటింక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నైజాం హక్కులను దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. సినిమాను స్వయంగా వీక్షించి మరీ ఈ చిత్రాన్ని ఆయన పంపిణీ చేస్తుండటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక కలర్స్ స్వాతి నటిస్తున్న 'త్రిపుర' చిత్రం కూడా విడుదలకు ముందే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రోజుల్లో చిన్న సినిమాలకు అంత ఈజీగా శాటిలైట్ అమ్మకాలు జరగడం లేదు. సినిమా విడుదలైనప్పటికీ చాలా చిత్రాలు శాటిలైట్ అమ్ముడుకాకపోతుండటం చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలై మంచి సినిమాగా గుర్తింపు పొందితే తప్ప ఇది సాధ్యం కావడంలేదు. కానీ 'త్రిపుర' చిత్రాన్ని విడుదలకు ముందే ఓ తెలుగు చానెల్ మంచి రేటుకు శాటిలైట్‌రైట్స్‌ను కొనుక్కుంది. ఇక సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న 'భలే మంచి రోజు' చిత్రం ఫస్ట్‌లుక్ మహేష్‌బాబు బర్త్‌డే సందర్బంగా విడుదలై అందరికీ ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సివుంది...!