Advertisementt

నాగ్‌ కోసం అనుష్క!

Tue 11th Aug 2015 09:31 AM
nagarjuna,anushka,karthi,dosth,mithrudu,size zero  నాగ్‌ కోసం అనుష్క!
నాగ్‌ కోసం అనుష్క!
Advertisement
Ads by CJ

నాగార్జున-అనుష్కలది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. గతంలో వీరు 'సూపర్‌, డాన్‌, ఢమరుకం, రగడ' వంటి పలు చిత్రాల్లో నటించారు. కాగా ప్రస్తుతం నాగార్జున -కార్తీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'దోస్త్‌' లేదా 'మిత్రుడు' అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుండగా, వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో కీలకమైన ఓ అతిథి పాత్రను అనుష్క పోషిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తయినట్లు సమాచారం. దీనికి బదులుగా అన్నట్లు అనుష్క నటిస్తోన్న 'సైజ్‌జీరో' చిత్రంలో నాగ్‌ గెస్ట్‌ అప్పీరియన్స్‌ ఇవ్వనున్నాడు...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ