Advertisementt

రామ్‌చరణ్‌ విజేతేనా!

Tue 11th Aug 2015 08:26 AM
ram charan tej,my name is raju,chiranjeevi,vijetha title  రామ్‌చరణ్‌ విజేతేనా!
రామ్‌చరణ్‌ విజేతేనా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. కాగా ఈ చిత్రానికి 'మై నేమ్‌ ఈజ్‌ రాజు, బ్రూస్లీ, విజేత...'ఇలా అరడజనుకు పైగా టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ఇంతకాలం తన తండ్రి పాటలనే రీమిక్స్‌ చేసిన రామ్‌చరణ్‌ ఈసారి టైటిల్‌ను కూడా తండ్రి సినిమా టైటిల్‌నే ఎంచుకున్నాదంటూ ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రానికి 'విజేత' అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏ విషయాన్ని తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే నాదు అంటే ఆగష్టు 22న ప్రకటిస్తారట. మరో విషయం ఏమిటంటే... చిరంజీవి నటించిన 'విజేత' చిత్రం విడుదలై వచ్చే దసరాకు 30ఏళ్లు అవుతున్నాయి. అదే దసరా సీజన్‌లో 30ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో రామ్‌చరణ్‌ నటిస్తున్న 'విజేత' చిత్రం అక్టోబర్‌ 15న దసరా కానుకగా విడుదలకానుండటం విశేషం అంటున్నారు. ఈ చిత్రానికి 'విజేత' టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు ఎక్కువశాతం మంది ఫిల్మ్‌నగర్‌లో చర్చింకుంటున్నారు. మరి రామ్‌చరణ్‌ కూడా 'విజేత' అనిపించుకుంటాడో లేదో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ