Advertisementt

పెళ్లికి రెడీ అంటోన్న కేరళకుట్టి!

Tue 11th Aug 2015 08:20 AM
asin,all is well movie,micromax mobile company,rahul sharma  పెళ్లికి రెడీ అంటోన్న కేరళకుట్టి!
పెళ్లికి రెడీ అంటోన్న కేరళకుట్టి!
Advertisement
Ads by CJ

దక్షిణాదిలో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌పై మోజుతో అక్కడి వెళ్లి చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకున్న కేరళ కుట్టి అసిన్‌. ఆమెపై గత కొంతకాలంగా అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లన్నీ కేవలం ఆమె వ్యక్తిగత జీవితంపైనే కావడం విశేషం. ఆ పుకార్లకు ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈమధ్య కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడానికి తన వ్యక్తిగత వ్యవహారాల కోసమే అని తెలిపింది. మైక్రోమాక్స్‌ మొబైల్‌ కంపెనీ అధినేత రాహుల్‌శర్మతో నాలుగేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న విషయాన్ని ఒప్పుకొంది. అందుకే రెండేళ్ల నుండి కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని సెలవిచ్చింది. 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' పూర్తయిన తర్వాత నిశ్చితార్థం చేసుకుంటుందిట. మరి పెళ్లి ఎప్పుడో మాత్రం ఆమె చెప్పడం లేదు. ఇప్పుడు ఆమెపై మరికొన్ని పుకార్లు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి అంతం ఎప్పుడో....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ