Advertisementt

కొరటాలకు కర్చీఫ్‌లు వేస్తున్నారు!

Tue 11th Aug 2015 08:11 AM
koratala siva,sreemanthudu,mahesh babu,ram charan  కొరటాలకు కర్చీఫ్‌లు వేస్తున్నారు!
కొరటాలకు కర్చీఫ్‌లు వేస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఒక్క సినిమా హిట్టయితే చాలు అప్పటివరకు కనీసం మొహం కూడా చూపించడానికి ఇష్టపడని స్టార్‌హీరోలు ఏకంగా ఆయా డైరెక్టర్లను పొగిడేస్తూ తదుపరి చిత్రానికి కర్చీఫ్‌లు వేస్తుంటారు. వాస్తవానికి 'మిర్చి'తో సూపర్‌హిట్‌ కొట్టినప్పటికీ కొరటాల శివ అనేక మంది స్టార్స్‌కు స్టోరీలు వినిపించినా చేస్తామంటూ ఊరించారే కానీ ఆయనకు అవకాశం మాత్రం ఇవ్వలేదు. రామ్‌చరణ్‌ అయితే ప్రారంభమైన సినిమాను కూడా ఆపేశాడు. బన్నీ అదిగో ఇదిగో అంటూ తిప్పించుకున్నాడు. ఎన్టీఆర్‌ కూడా అదే పని చేశాడు. కానీ ఎట్టకేలకు మహేష్‌బాబు అండతో, నమ్మకంతో కొరటాల శివకు 'శ్రీమంతుడు'తో చాన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా నేడు సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది. దీంతో ఇంతకాలం కొరటాల శివను తప్పించుకొని తిరిగిన స్టార్‌ హీరోలందరూ కొరటాల శివకు బొకేలు పంపిస్తూ... శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన 'మైత్రిమూవీస్‌' అధినేతలు ఆల్‌రెడీ మరో సినిమాకు కూడా కొరటాలకు అడ్వాన్స్‌ ఇచ్చారు. తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం చేయాలని మైత్రిమూవీస్‌ కోరిక అని తెలుస్తోంది. అయితే కొరటాల శివకు ఇప్పటికే మెగాక్యాంప్‌ తమ కాంపౌండ్‌లోకి తెచ్చుకోవడానికి రంగం సిద్దం చేసింది. బన్నీతో కొరటాలను ఓ సినిమా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బన్నీతో అంటే ఇక నిర్మాతలను కూడా వెత్తుక్కోవలసిన అవసరం ఉండదు. బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా చేయమని ఒత్తిడి వస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌లలో దేనికి కొరటాల శివ ఓకే చెబుతాడో వేచిచూడాల్సివుంది......! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ