ఎన్టీఆర్‌ బైక్‌ ముచ్చట్లు!

ఇటీవల వస్తున్న స్టార్‌హీరోల చిత్రాల్లో వారు నడిపే బైక్‌లు, కార్లు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక ఇటీవల వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్‌ సైకిల్‌ బాగా పాపులర్‌ అయింది. అదే తరహాలో ప్రస్తుతం ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'మా నాన్నకు ప్రేమతో' (వర్కింగ్‌ టైటిల్‌)చిత్రంలో హీరో ఎన్టీఆర్‌ నడిపే బైక్‌ను సుకుమార్‌ దగ్గరుండి మరీ అద్బుతంగా డిజైన్‌ చేయించాడట. ఈ చిత్రం మొత్తం ఎన్టీఆర్‌ ఇదే బైక్‌ను నడిపిస్తూ కనిపిస్తాడట. మహేష్‌ సైకిల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి ఎన్టీఆర్‌ బైక్‌ను డిజైన్‌ చేయించారని, ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ తన కొత్త గెటప్‌తో ఈ బైక్‌పై వేగంగా లండన్‌ వీధుల్లో తిరుగుతుంటే చూసేందుకు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా యూత్‌కు కనులపండువగా ఉంటుందని సుక్కు బావిస్తున్నాడు. కాగా ఈచిత్రంలో జగపతిబాబు ఓ కీరోల్‌ పోషించనుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌ చివరకు పూర్తి అవుతుందని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

ntr
ma nannaku prematho
sukumar
interpole officer