కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు, శృతిహాసన్ జంటగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం అన్నిచోట్లా మంచి హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే ముప్పై కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసింది. తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన సినిమా ఇంతటి ఘన విజాన్ని సాధించడంలో మహేష్ చాలా ఆనందంగా ఉన్నాడట. ఈ ఆనందాన్ని 'శ్రీమంతుడు' యూనిట్ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నాడు. దీని కోసం మహేష్ బాబు యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన కానుకలను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. గతంలో తమిళ హీరో, హీరోయిన్లు తమ చిత్ర బృందానికి బంగారు నాణెలు, వాచీలు గిఫ్ట్స్ గా ఇచ్చేవారు. ఇదే బాటలో మహేష్ కూడా తన సిబ్బందికి గిఫ్త్స్ ఇవ్వాలని యోచిస్తున్నాడు.